జామ ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జామ ఆకులతో చేసిన టీ తాగితే బరువు తగ్గొచ్చు. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. జామ ఆకులతో జుట్టు రాలే సమస్యను పోగొట్టుకోవచ్చు. గుప్పెడు జామ ఆకుల్ని నీళ్లలో 20 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని వడకట్టి ఆ నీళ్లలో గోరింటాకు, మందారాకు ముద్దను కాసేపు నాననివ్వాలి. దీన్ని తలకు రాసుకొని, కొంతసేపయ్యాక షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు రాలే సమస్య పోతుంది. ఈ ఆకులు తింటే పంటి నొప్పి, చిగుళ్లలో వాపు పోతాయి.