ముంబై: క్రిస్మస్ సందర్భంగా దేశీయ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థ జెట్ ఎయిర్‌వేస్, విమాన టిక్కెట్లపై 30 శాతం వరకు ఫెస్టివ్ డిస్కౌంట్ సేల్ ఆఫర్ ప్రకటించింది. దేశ, విదేశీ మార్గాల్లో ప్రయాణించే 66 జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసుల్లో ఎకానమీ, బిజినెస్ క్లాస్ టిక్కెట్లపై ఈ డిస్కౌంట్ సేల్ వర్తిస్తుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కింద కొనుగోలు చేసే అంతర్జాతీయ సర్వీసుల టిక్కెట్లు వచ్చే జనవరి 7వ తేదీ వరకు వర్తిస్తాయి. దేశయ విమాన సర్వీసుల టిక్కెట్లు మాత్రం జనవరి 1 నుంచి 8 వరకు చెల్లుబాటవుతాయి. కంపెనీ వెబ్‌సైట్, మొబైల్ యాప్, ఇతర పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా ముందుగానే టిక్కెట్లు కొనేవారికి నిర్ణీత పరిమాణం దాటిన (ఎక్సెస్) బ్యాగేజీపైనా ఈ ఫెస్టివ్ ఆఫర్ కింద 20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపింది.