సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్రంలో అత్యున్నత ప్రాధాన్యతారంగం విద్యారంగమన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్, యూనివర్సిటీలకు ఉపకులపతులను తక్షణమే నియమించాలని కోరారు. రాష్ట్రంలో 18 యూనివర్సిటీల్లో 101 విభాగాల్లో 418 ప్రొఫెసర్ పోస్టులు, 801 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 3220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం 2023లో నోటిఫికేషన్ విడుదల చేశారని గుర్తుచేశారు. ఆయా పోస్టులను భర్తీ చేయడంలో గత వైసిపి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నోటిఫికేషన్ ఇచ్చిన 4439 యూనివర్సిటీ వెంటనే పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రామకృష్ణ లేఖ రాశారు.