ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాల్గవ రోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముుందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ప్రశ్నోత్తరాల అనంతరం వార్షిక బడ్జెట్‌పై చివరి రోజు చర్చ కొనసాగనుంది. తర్వాత ప్రభుత్వం సభలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టనుంది. 1. ఆంధ్రపదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. 2. ఏపి ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్ట సవరణ బిల్లును విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభలో ప్రవేశ పెడతారు. ప్రశ్నోత్తరాలలో కడప నగరంలో తాగునీటి సమస్య.. ఫీజు రీయంబర్స్‌మెంట్.. తణుకులో ఈఎస్‌ఐ ఆసుపత్రి... ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. గిరిజన ప్రాంతాల్లో కనీస సదుపాయాలు.. విద్యా శాఖలో ఖాళీలు.. మనుషుల అక్రమ రవాణా తదితర సమస్యలపై ఎమ్మెల్యేలు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. వాటికి మంత్రులు సమాధానాలు చెబుతారు. కాగా శుక్రవారం ఉదయం 10 గంటలకు శాసన మండలి సభ ప్రశ్నోత్తరాలతో ప్రారంభం ఐనది.