రైలు ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన సంఘటన చీపురుపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక కస్పా వీధికి చెందిన ఇప్పిలి జగదీష్ రైలు ఢీకొని మృతి చెందినట్లు జిఆర్పి ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు.
మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న జగదీష్ ను గరివిడిలో రైలు ఢీ కొట్టడంతో మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.