బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బంగారు పాల్యం మండలంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని వర్షం పడుతుంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చిరు వ్యాపారస్తులు, భవన నిర్మాణ కూలీలు, వ్యవసాయ కూలీల పనులకు ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లు నిర్మానుషంగా మారాయి. వర్షంలో తడుస్తూ విద్యార్థులు పాఠశాలలకు వెళ్లారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.