గుంటూరు స్తంభాలగరువుకు చెందిన ఉస్మాన్ సయ్యద్ అమెజాన్ లో ఒక ఆర్డర్ పెట్టాడు. అది నచ్చక రిటర్న్ చేసేందుకుగానూ గూగుల్లో హెల్ప్ లైన్ నంబర్ సెర్చ్ చేశాడు. ఈ క్రమంలో గూగుల్ లో పేర్కొన్న నెంబర్ కు ఫోన్ చేయగా వారు జెప్పినట్లు చేశాడు. అలా చేయడంతో ఆయన ఖాతా నుంచి విడతల వారీగా సుమారు రూ. 30 వేలు కట్ అయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.