వైసీపీ అధినేత వైఎస్ జగన్ అవినీతిలో భాగమే విద్యుత్ ఛార్జీల భారమని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. వైసీపీ చేపట్టిన నిరసనలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిరసన కొత్త డ్రామా అని కొట్టిపారేశారు. అధికారం పోవడంతో ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపిందే జగన్ అని వ్యాఖ్యానించారు.