శ్రీకాకుళం జిల్లాలో మలేరియా, డెంగ్యూ నివారణకు కట్టుదిట్టమై న పటిష్ట చర్యలను తీసుకోనున్నట్టు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. వారి కార్యాలయ ఆవరణలో జిల్లాకు మంజూరైన ఫాగింగ్ మెషీన్లను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెడ్డీస్ ఫౌండేషన్ ద్వారా జిల్లాకు 50 ఫాగింగ్ మెషీన్లు అందించారన్నారు.
ఈ ఫాగింగ్ యంత్రాలను జిల్లాలోని అన్ని మండల పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచి దోమలను నివారించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 17 ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయడం జరుగుతోందని, అందులో 15 ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేయడం జరిగిం దని, మిగిలిన రెండు ఆరోగ్య కేంద్రాలు పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమం లో మలేరియా అధికారి పీవీ సత్యనారాయణ, అదనపు వైద్యారోగ్యశాఖాధికారి టి.శ్రీ కాంత్, డెమో వెంకటేశ్వర్లు, వీబీడీ కన్సల్టెంట్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మలేరియా అధికారి, జిల్లా మలేరియా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.