టీడీపీ నాయకత్వాన్ని బలహీనపరచాలని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో మంచి వాతావరణం ఉందన్నారు. వైసీపీ బలహీన పడటంతో కొత్త రకం డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బొత్స సత్యనారాయణను కాకా పట్టామనడం అసత్య ప్రచారమేనని చెప్పారు.
175 అసెంబ్లీ స్థానాల్లో 88మంది కొత్త అభ్యర్థులకు పట్టం కట్టారంటే అది టీడీపీపై ఉన్న నమ్మకమని చెప్పారు.ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ పార్టీ ఆలోచనా విధానం ఇప్పటికైనా మారాలని అన్నారు. భవిష్యత్తులో విజయనగరం జిల్లాను ఆదర్శ జిల్లాగా మారుస్తామని చెప్పారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. బొత్స సత్యనారాయణ భూ దందాలు, భూ కబ్జాలు తమ దృష్టికి వచ్చాయని మంత్రి శ్రీనివాస్ తెలిపారు.