నగరంలోని కేబీఎన్ కళాశాలలో ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ‘ఇతర రాష్ట్రాల ప్రతినిధుల సదస్సు’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. మరో వేదికపై తెలుగులో న్యాయపాలనపై సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.మన్మథరావు, జస్టిస్ బి.కృష్ణమోహనరావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ నగేశ్ భీమపాక హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.