AP: తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. తమ తప్పు లేకపోయినా సరే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ సూచనలు తాము పాటిస్తున్నామన్నారు. అయితే టీటీడీ బోర్డు సమావేశం జరుగుతున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు తరఫున ఛైర్మన్ క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ క్రమంలో తాను క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన అన్నారు.