మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ వసమైంది. తిరుపతి డిప్యూటీ మేయర్ గా ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 26.. వైఎస్సార్సీపీకి 21 ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్బంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ మాట్లాడుతూ.. డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి విజయం సాధిస్తుందని నిన్ననే (సోమవారం) చెప్పామని అనుకున్నది సాధించామని అన్నారు. నిన్న తమ కార్పొరేటర్లు నలుగురిని వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకుని, కిడ్నాప్ చేశారని.. కిడ్పాన్ అయిన వారందరూ తిరిగి వచ్చేశారని తెలిపారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 26 ఓట్లతో విజయం సాధించిందన్నారు.వైఎస్సార్సీపీ నేతలు ఈ రోజు కూడా అడ్డదారిన గెలవాలని చూశారని.. దానిని తిప్పి కొట్టామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ చెప్పారు. శ్రీవారి ఆశీస్సులతో ఎన్డీయే కూటమి అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక లాంఛనంగా గెలుపొందారని ఎమ్మెల్యే తెలిపారు. మునికృష్ణ మాట్లాడుతూ.. 26 మంది సభ్యులు తనకు ఓట్లు వేసి డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన కార్పొరేటర్లకు, అండగా నిలిచిన ఎమ్మెల్యేకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే స్థానిక మంత్రి, తనకు మద్దతు తెలిపిన ఇతర నాయకులకు మనికృష్ణ ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తామని, కూటమి నేతలను కలుపుకుని తిరుపతిలో ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పారు.