అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వలసదారులపై కొరడా ఝలిపిస్తూ.. తాత్కాలిక వలసదారులపై చర్యలకు దిగారు. దేశంలో 5 లక్షలకు పైగా వలసదారుల తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. వీరంతా హైతీ, నికరాగ్వా, వెనెజులా, క్యూబా దేశాలకు చెందినవారన్నారు. వీరికి ప్రస్తుతం ఉన్న చట్టపరమైన రక్షణను రద్దు చేసి.. నెల రోజుల్లో వీరిని దేశ బహిష్కరణ చేయనున్నట్లు హోమ్‌లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోమ్ తెలిపారు. గత మూడేళ్ల నుంచి ఈ దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన వారు దాదాపు 5.32 లక్షల మంది ఉన్నారని.. వారందరికీ ఈ ఉత్తర్వులు వర్తి్స్తాయన్నారు.
![]() |
![]() |