సికింద్రాబాద్ కు చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ రాజమండ్రికి వస్తుండగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం సృష్టించింది. రోడ్డు పక్కన ప్రవీణ్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు పడిపోగా, దాని పక్కనే ఆయన మృతదేహం పడి ఉంది. అయితే, ఆయన మృతికి కారణాలు ఏంటన్నది పోస్టుమార్టంకు సంబంధించిన పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చెప్పగలమని ఏపీ పోలీసులు అంటున్నారు. ఇవాళ ఐజీ అశోక్ కుమార్ రాజమండ్రిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసు వివరాలు పంచుకున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రవీణ్ జాతీయ రహదారిపై ప్రయాణించిన సీసీ టీవీ ఫుటేజిని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ విడుదల చేశారు. నేషనల్ హైవేపై పలు టోల్ గేట్ల మీదుగా ప్రవీణ్ ప్రయాణించిన విజువల్స్ అందులో ఉన్నాయి. ఓ చోట ప్రవీణ్ వెనుకగా వెళ్లిన నాలుగు కార్లకు ఈ ఘటనతో సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
![]() |
![]() |