విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో జరుగుతున్న ఎంబీబీఎస్ పరీక్షల్లో మరో ఇద్దరు వైద్య విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. గత బుధవారం జనరల్ మెడిసిన్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడి ముగ్గురు విద్యార్థులు దొరికిపోయిన ఘటన మరవకముందే, శనివారం కమ్యూనిటీ మెడిసిన్ పరీక్షలో మరో ఇద్దరు విద్యార్థులు పట్టుబడటం గమనార్హం.బుధవారం జరిగిన ఘటనతో యూనివర్సిటీ స్పెషల్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. స్క్వాడ్ తనిఖీలో స్లిప్పులతో ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. విద్యార్థుల జవాబు పత్రాలు, గుర్తింపు కార్డులను ఇన్విజిలేటర్లు స్వాధీనం చేసుకున్నారు. జవాబు పత్రాలను మాల్‌ప్రాక్టీస్ కమిటీకి అధికారులు పంపించారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులను ఎన్నారై, నిమ్రా కళాశాలల విద్యార్థులుగా గుర్తించారు. మొత్తం 160 మంది వైద్య విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
![]() |
![]() |