ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రమే తిరుమల చేరుకున్న ఆమె సోమవారం ఉదయమే వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో తిరుమలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.క్రిస్టియన్ మతానికి చెందిన ఆమె తిరుమల శ్రీవారి సందర్శనకు మొదటిసారి వెళ్లారు. మరీ ముఖ్యంగా స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. టీటీడీ ఉద్యోగుల సూచనల ప్రకారం ఆమె ఆలయ సంప్రదాయాల ప్రకారం పూజలు చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆమె ఆలయంలో పూజాది కార్యకలాపాలు నిర్వహించడం హిందువుల మన్ననలు అందుకుంటోంది. అన్యమతస్తురాలైన ఆమె శ్రీవారిపై విశ్వాసాన్ని చాటుతూ డిక్లరేషన్ ఇచ్చారు.
![]() |
![]() |