సీజన్ ఏదైనా సరే దాహార్తిని తీర్చుకోవడానికి చల్లటి నీరు తాగడం వల్ల కొద్దిసేపు ఉపశమనం లభిస్తుంది. అయితే అధికంగా చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయదుఇదే విషయంపై అనేక పరిశోధనలు చేశారు. ఇందులో గోరువెచ్చని నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించింది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో వేడి నీరు సహాయపడుతుంది. అయితే వేసవిలో గోరువెచ్చని నీరు తాగవచ్చా? లేదో తెలుసుకుందాం..జీవితానికి నీరు చాలా అవసరం, మరియు ప్రతిరోజూ తగినంత నీరు త్రాగడం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ముఖ్యమైనది. చాలా మంది చల్లటి నీరు తాగినప్పటికీ, వేడి (గోరువెచ్చని) నీరు త్రాగడం వల్ల చాలా మందికి తెలియని అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
శరీరాన్ని డీటాక్స్ చేయడానికి: వేడి నీరు మీ శరీరం నుంచి మురికిని సహజంగా తొలగించడంలో సహాయపడుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల సిరలు కుంచించుకుపోతాయి. ఇది రక్త ప్రసరణను నెమ్మదించేలా చేస్తుంది. వేడి నీటిని తాగడం వలన రక్త నాళాలను విస్తరించడానికి పనిచేస్తుంది. అంతేకాదు వేడి నీరు మూత్రపిండాలు, కాలేయం పనితీరు కూడా మెరుగుపరుస్తుంది.పేగు ఆరోగ్యాన్ని ఆరోగ్యం: కడుపు ఉబ్బరం లేదా తిమ్మిరి, జీర్ణ సమస్యల విషయంలో కూడా వేడి నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చల్లటి నీరు తాగడం వల్ల కడుపు లేదా శరీరానికి ఇబ్బంది కలుగుతుంది. వేడి నీరు కడుపు ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఎంజైమ్‌లను కూడా నెమ్మదిస్తుంది.గోరువెచ్చని నీరు త్రాగేసమయంలో సమయం గురించి జాగ్రత్తగా ఉండండి: మీకు గోరువెచ్చని నీరు త్రాగే అలవాటు ఉంటే.. తాగే సమయం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోండి. ఉదయం ఖాళీ కడుపుతో లేదా తిన్న అరగంట తర్వాత త్రాగాలి. ఇలా చేయడం వలన తక్షణ ప్రయోజనం అందుతుంది. NCBI చేసిన పరిశోధన ప్రకారం గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల పేగు పనితీరు మెరుగుపడుతుంది.
మెరుగైన జీవక్రియ: వేడి నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుందని.. బరువు తగ్గడానికి సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.ఒత్తిడి నుంచి ఉపశమనం: ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే.. ఒత్తిడి, ఆందోళన నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది.
![]() |
![]() |