కణేకల్ మండలం ఎర్రగుంట గ్రామంలో గత కొన్ని రోజులుగా తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామ ప్రజలు సోమవారం విలేఖరులకు తెలిపారు. తాగునీటి కోసం కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ పొలాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
ఈ విషయం సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు తెలిపినతెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్రాగునీటితాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు.
![]() |
![]() |