ఆగలి మండలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు రోల్ల మండల వైకాపా కన్వీనర్ నరసింహారెడ్డి.
తన ద్విచక్ర వాహనంలో వస్తుండగా అగలి సమీపంలో ఇరిగేపల్లి వద్ద గొల్లహట్టి గ్రామానికి చెందిన తిమ్మరాజు తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరినీ తుంకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![]() |
![]() |