విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది నెలల గర్భిణిని ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. నిండు చూలాలు అని కూడా చూడకుండా ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. విశాఖపట్నంలోని మధురవాడ ఆర్టీసీ కాలనీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జ్ఞానేశ్వర్, అనూష గాఢంగా ప్రేమించుకున్నారు. మూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం పాటు వారి సంసారం సాఫీగానే నడిచింది. కానీ ఆ తర్వాత మనస్ఫర్ధలు మొదలయ్యాయి. ప్రేమ కాస్తా కోపంగా మారుతూ వచ్చింది. అయితే అనూష గర్భవతి అయ్యింది. ఇటీవలే ఫోటోషూట్ కూడా నిర్వహించారు.
సోమవారం ఏమైందో తెలియదు.. అనూష, జ్ఞానేశ్వర్ మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తీవ్రమై.. కోపంలో, క్షణికావేశంలో భార్య గొంతు నులిమాడు జ్ఞానేశ్వర్. నిండు చూలాలనే సంగతి కూడా మరిచి గట్టిగా గొంతు నులిమి ఊపిరాడకుండా చేశాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించగా.. అప్పటికై అనూష చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం జ్ఞానేశ్వర్ పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యను గొంతు నులిమినట్లు అంగీకరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యా్ప్తు చేస్తున్నారు. జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక విషయం తెలిసిన అనూష కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జ్ఞానేశ్వర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
![]() |
![]() |