ఎన్నికల నాటి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్న గ్రానైట్ పరిశ్రమను గాడిన పడేలా చేసేందుకు నూతన మైనింగ్ పాలసీని రూపొందించింది. మంగళవారం దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో పరిశ్రమ పూర్తిస్థాయిలో దెబ్బతింది. ఈ పరిస్థితులను సరిదిద్ది పరిశ్రమకు ఊతం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని పాదయాత్ర సమయంలో లోకేష్‌కు గ్రానైట్ అసోసియేషన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. కచ్చితంగా పరిశ్రమను కాపాడతామని ఆయన హామీ ఇచ్చారు. దాని కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న పరిశ్రమ వర్గాలు నూతన పాలసీతో ఊపిరిపీల్చుకున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.
![]() |
![]() |