జాతులు వేరైనా భాషలు వేరైనా మనమంతా ఒక్కటే అని కులాలు వేరైనా మతాలు వేరైనా మనమంతా భారతీయులమని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం నందికొట్కూరు పట్టణంలోని వడ్డేపేట వాల్మీకి నగర్ లో సిపిఐ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర్లు, మహిళలు బీబీ, లక్ష్మీదేవి, గీతాంజలి, నాయకులు ఏసన్న, సోమప్ప తదితరులు పాల్గొన్నారు.