ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2019, 03:27 PM

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాల్లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 16వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. 2018లో అరుణ్ జైట్లీ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీన జైట్లీ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇక సుప్రీంకోర్టు న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి రాంజెఠ్మలానీ బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కాగా, ఈ నెల 8వ తేదీన కన్నుమూశారు. ఈ క్రమంలో ఈ రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa