శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన సెప్టెంబర్ 30న ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని, ఇందుకోసం అన్ని విభాగాల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని టిటిడి అదనపు ఈ వో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని గోకులం సమావేశ మందిరంలో శనివారం ఉదయం టిటిడి అధికారులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని భద్రతా అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఆలయం, రిసెప్షన్, సెక్యూరిటీ, పోలీస్, ఇతర అధికారులు సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa