జిల్లా వ్యాప్తంగా అగ్రి గోల్డ్ బాధితుల్లో రూ.10 వేల లోపు పెట్టుబడులు పెట్టిన వారు అందరికీ ప్రభుత్వమే తిరిగి చెల్లింపులు చేపడుతుందని ప ముఖ్య మంత్రి కె. నారాయణ స్వామి తెలిపారు. ఇలా ఓ ప్రైవేట్ సంస్థ చేతిలో మోసపోయిన బాధితులను ఆదుకుంటున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన కొనియాడారు. గురువారం ఉదయం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన అగ్రి గోల్డ్ బాధితులకు నగదు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భగా అగ్రిగోల్డ్ బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ... జిల్లాలోని సుమారు 8,257 మందికి రూ.5,81,17,100 లు తిరిగి చెల్లించడం జరుగుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అగ్రి గోల్డ్ బాధితులకు అండగా నిలుస్తూ పెట్టుబడులు పెట్టి నష్టపోయిన బాధితులందరికి తిరిగి డబ్బులు చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనన్నారు. ఈ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు. అగ్రి గోల్డ్ సంస్థ మన దేశంలో 8 రాష్ట్రాల్లో విస్తరించబడి ఉందని తెలిపారు. ఇది 1995 వ సంవత్సరంలో విజయవాడలోనే స్థాపించబడిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యా ప్తంగా రూ. 3944 కోట్ల పెట్టుబడులతో సుమారు 11 లక్షల 57 వేల మంది లబ్ధిదారులు ఈ సంస్థను నమ్మారని...ఒక్క చిత్తూరు జిల్లాలోనే సుమారు 38,986 మంది లబ్ధిదారులు సుమారు రూ.110 కోట్ల పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారని.... ఇచ్చిన మాటకు కట్టుబడే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో రూ.10 వేలలోపు పెట్టుబడులు పెట్టిన వారికి తిరిగి డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతోందన్నారు తెలిపారు. ఈ ప్రభుత్వం అగ్రి గోల్డ్ బాధితులకు పూర్తి మద్దతుగా నిలుస్తోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమంలో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందజేసేందుకు చిత్త శుద్ధితో పని చేస్తోందని తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని.... రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా దశలవారీగా మద్యపాన నిషేదంతో పాటు ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వై.ఎస్. ఆర్ వాహన మిత్ర కార్యక్రమం ద్వారా ఆటో, ట్యాక్సీ డ్రైవరులకు సంవత్సరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించడం జరుగుతున్నదన్నారు. ఇక మరోవైపు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ నెల 14 వ తేది నుండి నాడు–నేడు కార్య క్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అగ్రిగోల్డ్ భాదితులకు రూ.5,81,17,100ల మెగా చెక్కును అంద జేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa