విజయవాడ: జగన్ సర్కార్‌పై తనదైన శైలిలో విమర్శలు చేసే విజయవాడ ఎంపీ కేశినేని నాని.. క్రిస్మస్ సందర్భంగా వెరైటీగా ట్వీట్ చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూనే.. అధికారపక్షంపై వ్యంగ్యాస్త్రం సంధించారు. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అనిశ్చితిలో పడేసిన జగన్‌కు, ఆయన గ్యాంగ్‌కు, వైసీపీకి ప్రత్యేకమైన క్రిస్టమస్ శుభాకాంక్షలు. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు. మీరు, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని క్రిస్టమస్ సందర్భంగా భగవంతుడిని కోరుకోండి అంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa