మహారాష్ట్రలో రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెప్పారు. 2015 ఏప్రిల్ 1నుంచి 2019 మార్చి 31 వరకూ రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయిల వరకూ ఉన్న స్వల్ప కాలిక పంట రుణాలను మాఫీ చేయాలని ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులకు తక్షణ ఉపశమనం కలిగించేలా 2 లక్షల రూపాయిల వరకూ ఉన్న రుణాలను మాఫీ చేశామని, అయితే వారి మొత్తం పంట రుణాలను మాపీ చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa