ఏపీలో మందడం నుంచి సచివాలయానికి వెళ్లే దారిలోని ఇళ్ల వారికి పోలీసులు నోటీసులు జారీ చేసారు. ఈ నెల 27 సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొత్త వ్యక్తులను ఇళ్లలో ఉంచుకోవద్దని పోలీసులు నోటీసులో సూచించారు. ఎవరైనా కొత్త వాళ్లు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు నోటీసులో పేర్కోన్నారు. ఈ నెల 27న జరిగే మంత్రిమండలి సమావేశంలో మూడు రాజధానుల నివేదికపై చర్చించనున్నారు. కేబినెట్ మీటింగ్ తర్వాత రాజధాని మార్పుపై ప్రకటన చేయనున్నారు. దీంతో ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకే నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa