రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఒక్క ఓటు కూడా చాలా కీలకం. అందుకే కరోనా బారిన పడ్డారని తెలిసినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు ఓటు వేసే అవకాశం ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలా పీపీఈ సూట్ ధరించి ఓటింగ్ కి హాజరయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన రాకతో ఎన్నికల సిబ్బంది కాస్త భయపడ్డారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణాన్ని మరోసారి శానిటైజ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa