ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్‌ మినిస్టర్‌

international |  Suryaa Desk  | Published : Mon, Oct 25, 2021, 03:44 PM

ఇస్లామాబాద్‌: టీ20 వరల్డ్‌ కప్‌ లో దాయాది దేశాల మధ్య జరిగిన రసవత్తరపోరులో టీమీండియా ఘోర పరాభవాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మినిస్టర్‌ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంపై పాక్‌ సాధించని విజయాన్ని ఇస్లాం విజయంగా వర్ణించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు...పాకిస్తాన్‌ కు చెందిన మినిస్టర్‌ షెయ్‌ రషీద్‌ అహ్మద్‌ టీమిండియాపై పాక్‌ విజయం అనంతరం స్పందించారు. '' ఇండియా-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు పాకిస్తాన్‌కే మద్దతు తెలిపారు. మేమే గెలవాలని కోరుకున్నారు. పాకిస్తాన్‌ వరకు నిన్న జరిగిన మ్యాచ్‌ ఫైనల్‌తో సమానం. ఇది పాక్‌ విజయం కాదు.. ఇస్లాం విజయం'' అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa