కృష్ణా జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయం నుంచి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, వ్యవసాయ, పశుసంవర్ధశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) ఎండీ ఎ బాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ ఆర్ అమరేంద్రకుమార్, అమూల్ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీ ఎం పటేల్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa