దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (19*), హనుమ విహారి(4*) ఉన్నారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26), పుజారా(3), రహానె(0)లను వెనువెంటనే సౌతాఫ్రికా బౌలర్లు అవుట్ చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఒలీవియర్ 2, మార్కో జాన్సెన్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆడకపోవడంతో రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. కోహ్లీ స్థానంలో విహారి జట్టులోకి వచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa