మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కుటుంభానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి పులివెందుల ప్రజలు ఆవేదనకు గురవుతున్నారని టీడీపీ నేత బీటెక్ రవి పేర్కొన్నారు. వివేకా హత్యతో అందరూ షాక్ కు గురయ్యారని తెలిపారు. ఈ హత్య కేసులో వైసీపీ ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డిలు నార్కో అనాలసిస్ పరీక్షలకు ఒప్పుకోవాలని... లేని పక్షంలో హత్యతో వారికి సంబంధం ఉన్నట్టు అనుమానించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కేసులో నిందితుడు శంకర్ రెడ్డి ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారని... దీంతో జగన్ పై కూడా అనుమానాలు వస్తున్నాయని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa