ప్రభాదేవి రైల్వేస్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాటపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఒకేసారి వందలాది మంది ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైకి రావడంతో.. జరిగిన తొక్కిసలాటలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే అధికారులతో కలిసి విచారణ జరిపిస్తామని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు మంత్రి వినోద్ తావ్‌డే ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆయన.. వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa