సంకల్పమ్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి పలుకు బధిరుల ఆశ్రమ పాఠశాల నందు మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ వాసిరెడ్డి రాంబాబు గారు ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు, టీడీపీ నాయకులూ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పేద విద్యార్థులకి నిలయం లాంటి ఈ స్కూల్ ఎంతో మేలు కరమైనది అనే ఉద్దేశంతో తన వంతు సాయంగా ఈ స్కూల్ విద్యార్ధులకి 20,000 రూపాయలు విరాళంగా అందించారు.