ఏపీ విభజన హామీలో చెప్పిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమలుకు తీసుకున్నచర్యలు & దేశంలో 4వ అతిపెద్ద రైల్వే స్టేషనైన విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు, రవాణాకు సౌకర్యాలను మెరుగుపరచాలని లోక్ సభలో ప్రధాన అంశంగా ప్రస్తావించిన తెలుగు దేశం పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని నాని. విభజన విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ అన్నిటిలోను , కేంద్రం మొండి చెయ్యి చూపింది. వాటిలో భాగమే ఈ రైల్వే జోన్ కూడా . కాబట్టి ఏదైనా చేసి ఆంధ్ర కు న్యాయం చెయ్యండి అని ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇచ్చిన హామీకి కేంద్రం కట్టుబడి వుందని, త్వరలోనే విశాఖ రైల్వేజోన్ పనులు ప్రారంభం అవుతాయని రైల్వే శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు.