రోజాపై మంత్రి కందుల దుర్గేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దావోస్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదని రోజా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజమండ్రిలో మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ క్యాబినెట్లో అందరినీ దావోస్ తీసుకుని వెళ్లారని అన్నారు.రోజా అవగాహన రాహిత్యంతో చేస్తున్న వ్యాఖ్యలని కొట్టి పారేశారు. గత ప్రభుత్వంలో మంత్రి రోజా పర్యాటక శాఖను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.విశాఖపట్నం ఋషికొండ వద్ద పర్యాటక ప్రాంతంలో ప్యాలెస్ ఎందుకు కట్టారని ప్రశ్నించారు. ప్యాలెస్ నిరుపయోగంగా ఉందని, ఎందుకు పనికి రావడం లేదన్నారు. ప్యాలెస్ నిర్మాణం కారణంగా. టూరిజనికి వచ్చే ఆదాయానికి గండి పడిందని మండిపడ్డారు మంత్రి దుర్గేష్.