అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ ఈసారి గ్రీన్‌లాండ్‌ను దక్కించుకుంటానని చెప్పారు. ఆ కలను నెరవేర్చుకోవడానికి తాజాగా డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌కు ఫోన్ చేశారు. ముఖ్యంగా వారి అధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను అమ్మాలంటూ ప్రతిపాదించారు. కానీ డెన్మార్క్ ప్రధాని మాత్రం అది కుదరదని చెప్పారట. పెద్ద ఎత్తున ఖనిజాలు లభించే గ్రీన్‌లాండ్‌ను అమ్మాలనే ఉద్దేశమే తమకు లేదని వివరించగా.. ట్రంప్ చాలా సీరియస్ అయినట్లు సమాచారం. ఈక్రమంలోనే మెటె ఫ్రెడెరిక్సన్‌తో చాలా దూకుడుగా మాట్లాడరట. తన కలను నెరువేర్చుకునేందుకు బెదిరింపులకు కూడా పాల్పడ్డారట. ఆ మాటలు విన్న ట్రంప్ వద్దనున్న అధికారులు వాటికి ఆశ్చర్యపోయారని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి.
మొత్తం 45 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్ కాల్‌లో.. ట్రంప్ డెన్మార్క్ మీద విధించబోయే సుంకాల గురించి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. కానీ డెన్మార్క్ ప్రధాని మాత్రం వాటేమిటికీ భయపడకుండా గ్రీన్‌లాండ్‌ను అస్సలే అమ్మబోమని వివరించినట్లు సమాచారం. ఈక్రమంలోనే ట్రంప్ కేవలం సుంకాలు మాత్రమే విధించకుండా.. ఇతర చర్యలు కూడా తీసుకోబోయే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
ట్రంప్ ఎన్నోరోజులుగా కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ గ్రీన్‌లాండ్‌లో రాగి, లిథియం వంటి కనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన ఇక్కడ.. 2.16 మిలియన్ చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఖనిజాలు ఉన్నాయి. 75 శాతానికి పైగా ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉన్నప్పటికీ.. 30 శాతం గ్యాస్ నిల్వలు కూడా ఉన్నాయి. కేవలం 55, 600 మంది మాత్రమే ఇక్కడ జీవిస్తుండగా.. దీన్ని చేజిక్కించుకోవాలని ట్రంప్ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. కానీ గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడం అంత సులువైన పని కాదని నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.