76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత దేశ ప్రజలకు అమెరికా శుభాకాంక్షలు తెలిపింది. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి తమ సహకారం అందిస్తామని వెల్లడించింది.ఈమేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.'అమెరికా తరఫున భారతదేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభకాంక్షలు. భారత రాజ్యంగం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పునాదిగా గుర్తింపు పొందడాన్ని మేము నమ్ముతాం. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. భారత్-అమెరికా ప్రజల మధ్య శాశ్వతమైన స్నేహం, సహకారం మన ఆర్థిక సంబంధాలను ముందుకు నడుపుతుందని విశ్వసిస్తున్నాం. అంతరిక్ష పరిశోధనలతో సహా రానున్న సంవత్సరాల్లో మన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఎదురుచూస్తున్నాం' అని రూబియో పేర్కొన్నారు.