భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని (republic day 2025) వైభవంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ వేడుకలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీ(delhi)లోని విధి మార్గంలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భారతదేశం తన శక్తిని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఈ రోజున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా భారతదేశం స్వాతంత్ర్య, రాజ్యాంగ నిర్మాణం, ఐక్యత, ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ రోజు జరిపే వేడుకలు దేశ భక్తికి, సమాజాన్ని ఐక్యంగా ఉంచే ప్రేరణగా మారాయి.