యుద్ధం ఆపాలంటూ రష్యా టీవీ లైవ్ షోలో మెరీనా ఓవ్స్యానికోవా అనే ఓ మహిళా జర్నలిస్ట్ నిరసన తెలిపారు. ఇప్పుడు ఆమెకు దాదాపు 15 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మాస్కోలోని ఛానల్1లో ఆమె పనిచేస్తున్నారు. యుద్ధం ఆపాలని ప్లకార్డుతో రష్యాకు వ్యతిరేకంగా ఆమె నిరసన తెలిపారు. దీంతో వెంటనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మెరీనా అనంతరం మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను న్యూయార్క్ టైమ్స్ ట్విటర్ లో పోస్టు చేసింది. పోలీసులు తనను 14 గంటలపాటు పోలీసులు విచారించినట్లు తెలిపింది. తన కుటుంబాన్ని కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని, న్యాయ సహాయం కూడా అందలేదని వాపోయింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం భయంకరంగా సాగుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నానని ఆ మహిళా జర్నలిస్ట్ తెలిపారు. ఈ విషయం తెలిసిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మెరీనా తండ్రి యుక్రెయిన్ దేశస్థుడు కావడంతో ఆమె ఆ దేశానికి మద్దతుగా నిరసన వ్యక్తం చేసింది.