తన స్నేహితులందరూ అమ్మాయిలో షికార్లు చేస్తున్నారని, తనకెవరూ లేరని ఆ యువకుడు భావించాడు. ఒంటరితనం పోగొట్టుకునేందుకు డేటింగ్ యాప్‌లో సెర్చింగ్ ప్రారంభించాడు. ఓ అమ్మాయితో పరిచయం కావడంతో సంతోషంతో పొంగిపోయాడు. కొన్నాళ్లకు తనను రూమ్‌కు రావాలని ఆహ్వానించాడు. ఆ అమ్మాయి కూడా చెప్పినట్లే రూమ్‌కు రావడంతో సంతోషంలో మునిగిపోయాడు. అయితే కొద్దిసేపటికే అసలు విషయం తెలిసి షాక్ తిన్నాడు. సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలోని దక్షిణ జిల్లాలో ఓ యువకుడికి డేటింగ్ యాప్‌లో హీనాఖాన్ పేరుతో యువతి పరిచయం అయింది. అమ్మాయి అనుకుని బాధిత యువకుడు తన రూమ్‌కు ఆహ్వానించాడు. ఓ రోజు హీనాఖాన్ పరిచయమైన యువతి మరో యువతితో సదరు యువకుడి రూమ్‌కు వెళ్లారు. అయితే వారు అమ్మాయిలు కాదని, నపుంసకులని కొద్ది సేపటికే ఆ యువకుడిని తెలిసింది. దీంతో షాక్ తిన్నాడు. తేరుకునేలోపే వచ్చిన వారిద్దరూ అతడిని బట్టలూడదీసి నగ్నంగా మార్చేశారు. ఆ తర్వాత అతడిని వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ చేశారు. అతడి నుంచి బంగారం, డబ్బులు, ఖరీదైన ఫోన్ తీసుకుని ఉడాయించారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను చూపించి పదేపదే బ్లాక్‌మెయిలింగ్ ప్రారంభించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి, తన గోడు వెళ్లబోసుకున్నాడు. కేసు నమోదు చేసి, పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుల నుంచి బాధితుడి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితులను అరెస్టు చేశారు.