ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అల్లు స్టూడియోస్' ప్రారంభించిన బన్నీ కుటుంబ సభ్యులు

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 01, 2020, 03:30 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నట దిగ్గజంగా పేరొందిన అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అల్లు రామలింగయ్య జయంత్యోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులో అల్లు స్టూడియోస్ పేరిట భారీ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ స్టూడియో నిర్మాణ పనులు ప్రారంభించినట్టు అల్లు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ కుటుంబం మొత్తానికి సినిమా అంటే ప్రాణమని, తమకు ఆనందాన్నిచ్చేది సినిమానే అని స్పష్టం చేశారు.
అల్లు రామలింగయ్య ఘనవారసత్వాన్ని కొనసాగించేందుకు తమకు సినిమానే మార్గమని ఈ ప్రకటనలో వివరించారు. అల్లు స్టూడియోస్ ను ఆయన జ్ఞాపకార్థం అంకితమిస్తున్నామని ప్రకటించారు. అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలతో ఈ స్టూడియో నిర్మాణానికి పునాదిరాయి వేశామని తెలిపారు. హైదరాబాద్ గండిపేట ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టూడియో రూపుదిద్దుకోనుంది. అత్యాధునిక సౌకర్యాలతో సినీ, టెలివిజన్ చిత్రీకరణకు అనువుగా ఉండేలా ఈ స్టూడియో నిర్మానం ఉండనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa