యంగ్ హీరో నాగ శౌర్య, కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన మూవీ ‘లక్ష్య’. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా గా రానుంది. మూవీ ఈ మూవీ డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. విలువిద్య నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కీ .. లిరికల్ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలడానికి సిద్ధమవుతున్నారు. వెంకటేశ్ చేతుల మీదుగా డిసెంబర్ 1వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. వచ్చేనెల 10వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం నాగశౌర్య సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపించనున్నాడు. మరో కీలక పాత్రలో జగపతిబాబు అలరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa