ప్రస్తుతం సమంత షెడ్యూల్ బిజీ గా ఉంది. వరుస సినిమాలను ప్రకటిస్తూనే ఉంది. మధ్యలో యాడ్స్ తోను చేతినిండా సంపాదిస్తుంది. అయితే సామ్ పుష్ప మూవీ లో స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే.. ఆ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఈ రోజున మొదలైంది. సమంత తదితరులపై ఈ పాటను కొన్ని రోజుల పాటు చిత్రీకరిస్తారట. ఈ సినిమా హైలైట్స్ లో ఈ పాట ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. సాధారణంగా సుకుమార్ సినిమా అంటే, మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ నెంబర్ ఉంటుంది.
అలాంటి ఐటమ్ నెంబర్ ఈసారి సమంతపై చిత్రీకరిస్తుండటం విశేషం. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకు వదిలిన ప్రతి పాటకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. రష్మిక కథానాయికగా కనువిందు చేయనున్న ఈ సినిమాలో, ఫాహద్ ఫాజిల్ .. జగపతిబాబు .. సునీల్ .. అనసూయ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సాంగ్ పై భారీగానే అంచనాలు ఉన్నాయి. అందులోను సమంత ఈ ఐటమ్ సాంగ్ చేయడంతో బన్నీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa