డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని సమాచారం. ఆ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ నిన్న ప్రారంభమైంది. కొన్ని రోజుల పాటు సమంత తదితరులపై ఈ పాటను చిత్రీకరించనున్నారు. ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. సాధారణంగా సుకుమార్ సినిమా అంటే మాస్ ఆడియన్స్ ని ఊపేస్తుంది. ఈ సారి సమంతపై అలాంటి ఐటెం నంబర్ రాబోతుండటం విశేషం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటి వరకు వదిలిన ప్రతి పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రష్మీ కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ .. జగపతిబాబు .. సునీల్ .. అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa