ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“బంగార్రాజు” సెకండ్ సింగిల్‌కి ముహూర్తం ఫిక్స్..!

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 30, 2021, 01:13 PM

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న తాజా చిత్రం "బంగార్రాజు". 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. అయితే తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ కోసం చిత్ర బృందం ముహూర్తం ఫిక్స్ చేసింది. డిసెంబర్ 1న ఉదయం 11:12 గంటలకు ‘నా కోసం’ పాట టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa