రేపు ప్రేక్షకుల ముందుకు 'సెబాస్టియన్ పీసీ 524' చిత్రం రానున్నది. యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'సెబాస్టియన్ పీసీ 524' చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 28న ఉదయం 11.04 గంటలకు విడుదల కానుంది. కాగా, ఈ ట్రైలర్ కు సంబంధించిన గ్లింప్స్ వీడియో రేపు ఉదయం 11.04 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇదిలావుంటే 'సెబాస్టియన్ పీసీ 524' చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. జోవిత సినిమాస్, ఎలైట్ గ్రూప్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రానికి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన కోమలి ప్రసాద్, నువేక్ష నటించారు. జిబ్రాన్ సంగీతం అందించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa