టాలీవుడ్‌లోనే కాక దాదాపు అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలకు రానా సుపరిచితం. ఇక బాహుబలిలో ప్రతినాయక పాత్రో ఆయన పేరు మార్మోగిపోయింది. తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన భీమ్లానాయక్ అఖండ విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమాను తాను ఎంచుకోవడానికి గల కారణాన్ని ఓ ఛానల్‌తో మాట్లాడుతూ ఇటీవల ఆయన వెల్లడించారు.
మళయాలంలో రూపొందిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా తెలుగు రీమేక్ హక్కులు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తీసుకుందన్నారు. విషయం తెలియగానే నిర్మాత నాగవంశీకి ఫోన్ చేశానని, మాతృకలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర తెలుగులో తాను చేస్తానని చెప్పానని రానా పేర్కొన్నారు. దీనికి త్రివిక్రమ్ మాటలు కూర్చడం, తమన్ సంగీతం అనగానే విపరీతమైన అంచనాలు పెరిగాయన్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సినిమాలో భాగమయ్యారో సినిమా రూపురేఖలు మారిపోయాయన్నారు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన, తన జోనర్ సినిమా కావడంతో తాను దీనిపై ఆసక్తి చూపానన్నారు. మాతృకలో కీలకాంశాన్ని తీసుకుని, తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యేలా కథను రూపొందించినట్లు చెప్పారు. సినిమా ఊహించని విజయం సాధించిందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa